• Political Map
  • Saraswathi Temple
  • Papermill
  • Ghat
  • Fort
  • Railway Station
  • Waterfall
  • Laxmi Narasimhaswamy Temple
  • Project Dam

మన కాగజ్‌నగర్

ఆదిలాబాద్  జిల్లా కేంద్రానికి సుమారు 180 కి.మీ. దూరంలో మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న ఓ మోస్తరు గ్రామం కొత్తపేట. చుట్టు పక్కల కావాల్సినన్ని ప్రకృతి వనరులు, సికింవూదాబాద్ - బలార్షా రైలు మార్గం ఉండడంతో కొత్తపేట వద్ద కాయితాలు తయారుచేసే ఫ్యాక్టరీ స్థాపితమైంది. కాగితాల పట్టణం కాబట్టి కొత్తపేట కాస్తా ‘కాగజ్‌నగర్’ అయింది. మండల వ్యవస్థకు పూర్వం ఇది సిర్‌పూర్ తాలుకాలో ఉండేది. అందుకే దీన్ని ఆ గుర్తింపుతో ‘సిర్‌పూర్ కాగజ్‌నగర్’ అనేవారు.

ఇక్కడే కృత్రిమ పట్టు, సిల్క్ బట్టల కర్మాగారం ‘సర్‌సిల్క్’ పేరుతో ఉండేది. ఈ రెండు మిల్లులకు వేర్వేరు కార్మికవాడలు, ఎస్.పి.ఎం (సిర్‌పూర్ పేపర్ మిల్) కాలనీ, సర్ సిల్క్ కాలనీలుగా కార్మిక నివాస గృహాలు, రిక్రియేషన్ క్లబ్‌లు, పాఠశాలలు ఉండేవి.

కాగజ్‌నగర్ పట్టణానికి దగ్గర్లో ఈజ్‌గాం అనే పల్లెటూరుంది. అక్కడ అతి ప్రాచీనమైన శైవమందిరం ఉంది. శివరావూతినాడు ఆ ఆలయం వద్ద పెద్ద జాతర జరుగుతుంది. పేపర్, సిల్క్ మిల్లుల యాజమాన్యాలు విద్యుద్దీపాలతో గుడిని అలంకరించి భక్తుల కోసం అనేక సదుపాయాలు కల్పించేవారు. మందిరానికి ఆదాయం కూడా పెద్ద మొత్తంలో వచ్చేదని వినికిడి. అప్పట్లో ఇక్కడ చిన్నపాటి విమానాశ్రయం కూడా ఉండేది. రెండు కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు, పెద్ద యంత్రాలను నెలకొల్ప వచ్చే విదేశీయులు విమానాల్లోనే వచ్చిపోయేవారు. ఓసారి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కూడా విమానంలోనే వచ్చినట్లు గుర్తు.

ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకొని తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన కాగజ్‌నగర్ లో అప్పటి వెలుగుల జిలుగులు ఎక్కడా లేవు. దేశంలోనే ఎంతో పెద్దదైన పేపర్‌మిల్లు పడుతూ లేస్తూ నడుస్తోంది. అందులోనూ నవీన సాంకేతికత పెరగడంతో కార్మికులు బాగా తగ్గిపోయారు. కార్మిక నివాసాలు బోసిపోయాయి. ఒకప్పడు, మా ఊరు చూడ ముచ్చట! ఇప్పుడు పట్టణంలోని అందచందాలన్నీ పూర్తిగా మారిపోయాయి. దాంతో, ‘మీ ఊర్లో చూడడానికేముంది’ అంటున్నారు. అవును. తోటలోని పూలన్నీ నేలరాలినప్పుడు తోటను చూడ ఎవరిష్ట పడతారు!
సర్‌సిల్క్ పూర్తిగా మూతపడటంతో కార్మికులంతా బతుకుదెరువు కోసం ముంబై, సూరత్, భీవండీలకు వలసపోయారు. మరికొందరు ఇక్కడే ఉండి కలో గంజో తాగుతూ అలమటిస్తున్నారు. పండుగకో పబ్బానికో కొడుకులు వచ్చి ఇచ్చే నాలుగు రూపాయల్ని పొదుపుగా వాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
ఆర్.బి.రోడ్ పై అప్పటి హల్‌చల్ లేదు.

రామ్‌మందిర్‌లో నామమాత్రంగా జరిగే పూజల్లో ఎవరూ పాలుపంచుకోవడం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ఊసెత్తే వారే లేరు! తెల్లారితే పొట్టకూటికి కూలీ వెదుక్కోవడంతోనే సరిపోతుంది వారికి.
చిన్నా పెద్దలతో కళకళలాడే వెల్ఫేర్ సెంటర్ వెల ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడిన చాలామంది వారి స్వంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. లలిత కళాసమితి, రెండు క్లబ్‌లు- ఏ సారస్వత, సాంస్కృతిక కార్యక్షికమాలు లేక బోసిపోతున్నాయి!చెట్టూ చేమతో పచ్చగా కనబడే సర్‌సిల్క్ కాలనీ నిర్జనమై, కార్మికుల ఇల్లన్నీ కూలిపోతున్నాయి. అడవి జంతువులు అప్పుడప్పుడు వచ్చి బీభత్సాలు సృష్టిస్తున్నాయి